Monday, April 9, 2012

వినబడలేదా ??
నీ  జడగంటకి చిక్కుకున్న
నా  హృదయం విలవిల
నీ  నవ్వులో ఈదుతూ
అలసిపోయా అర్ధం అనే తీరం  తెలియక
మాటలకు ఊపిరి పోసే
నీ శ్వాస తగలగానే .. మారం చేసే
గుండెను ఓదార్చేదెవరు ?
మూతి ముడుచుకుని అలిగే
వేళా ..దూరం తగ్గించే నేస్తం ఎవరు
దాహం తీరగానే మరిచే
తటాకాన్ని నేనా ?
దాటిపోయిన బాటని .. బాటసారిని
వెనుదిరిగి చూడరెవరని
నువ్వు రుజువు చేసావు కదా