Monday, April 9, 2012

ఆకలి

ఆకలి కన్నా విలువైన 
ఆత్మీయ ఆలింగనం వారి పెదాలపై 

ఎన్ని డబ్బులిచ్చి 
ఆ నవ్వు తేగలవు వారి మొహాలపై 


చేతులు కలిపినా మారని జీవితాలలో 
చీకటిఅయిన దారులపై 
పూయించ గలవా వెలుగుల కాంతి
పూవులే ..నీవై 


మనుషులమే .. మనసుల ఆర్దత ఒకటే 
మాటలు వేరైనా హృదయం చెప్పే 
ఊసులు ఒకటే .. 
ఎప్పటికి అర్ధమయ్యేను ఆకలి 
బాష లోకానికి .. 
ఎటు నుంచి వచ్చెను వెలుగు 
వీరి జీవితాల మార్పుకి ..