నీ జ్ఞాపకాలు నా పెదాలపై
ఎరుపు రంగు తెచ్చాయి
చలనం లేని పెదాల రేకులకు
వణుకును పుట్టిస్తున్నాయి
తేనె ధారలూరే
మనసు బావి నువ్వై
తీపినంతా నింపుకున్న
చెరుకుగడ నువ్వై
రుచి చూపిస్తున్న
జ్ఞాపకాల నొదిలి నేనెక్కడికెల్లను ?
నీ స్మృతుల మధురిమలను వదిలి
ఎలా మనగలను?