ఏముంది నీకివ్వడానికి నాదగ్గర
బహుమతిగా
నీ కోసం కొండంత ఆశిస్సులు
శుభాలు కోరుకోవడం తప్ప ..
ఎంతో ఎదిగేవరకు
ఎన్నో సాదించే వరకు
పదిమందిలో నిన్ను పైవాడిగా
చూసేవరకు
విజయపు మెట్లన్నీ ఎక్కి
విజేయుడవయ్యే వరకు
నీకోసం హృదయాన్ని ప్రమిదగా
చేసి దేవుడిని రోజు ప్రసన్నం
చేసుకోవడం తప్పు
నీలాంటి నేస్తం నాకు దొరకడం
నేను దేవుణ్ణి అడగకుండానే
పొందిన వరం
నీవు మాటలతో అందించే చేయూత
నేను తీర్చుకోలేని ఋణం
ఒంటరి అయిన వేళ మాటల
అల్లరిని చల్లి
ప్రోత్సాహం కోసం ఎదురుచూస్తున్నప్పుడు
వెన్ను తట్టి నిలబెట్టి
నన్ను నేను శోదించుకునే సమయంలో
నాతో పాటు నిద్రనోదిలి
కొంచెం సమయంలోనే నేస్తం
కొండంత ధైర్యం అయినందుకు
హృదయ పూగుత్తినే
నీ పుట్టిన రోజు బహుమంగా ఇస్తూ ...
ఆశీస్సుల సుమ పరిమళాలను
మేఘాలనిండా నింపి నీ మీద
కురవమని పంపుతూ ..
అందజేస్తున్న
ఆత్మీయ
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు