తూకమేస్తున్న నిన్ను ప్రేమిస్తున్నా
అని చెప్పడానికి ఎన్ని మాటలు
కావాలో అని .. ?
ఎక్కడ మాటలన్నీ తేలికవుతున్నాయి
నీ ప్రేమ మాత్రం
ఇంచు కూడా పైకి లేవట్లేదు ..
అంత ప్రేమించావా ఏంటి ?
కొండంత ప్రేమ
కడలి అంత ప్రేమ
ఆకాశమంత ప్రేమ
నాది అని చెపుతూ ఊరేగే వారు
ఉన్నారని తెలుసు
కాని మౌనంగా ఇంత ప్రేమ
ఎలా పెంచుకున్నావ్
నా మీద ??
నీ వైపు చూసినప్పుడల్లా
నా వైపుకు ప్రవహించే
అభిమానమే తప్ప ..
ప్రేమ కనబడలేదే
అని పొరబడ్డానా?
ఏమో ... నీ హృదయపు సముద్రంలో
ఇంకా ఎంత గుప్త ధననిధిలా
ప్రేమ దాచుకున్నవో
తెలియదు కానీ ..
ఈ ఒక్క సారికి
నా ప్రేమను నీ ప్రేమతో
సరితూగ నివ్వవా?
నీ అడుగులో అడుగు వేసే
అర్హత కోసం ఈ విజయం
నన్ను వరించనివ్వవా .. ?