Sunday, June 3, 2012

నేను-ముసుగు



కోల్పోతున్నా నన్ను నేను 
నేనెవరో తెలుసుకోవడంలో 
జీవించడం మరచిపోతున్నా
అనుక్షణం నటించడంలో ... 

ఏడుపు వెనకాల నవ్వు 
దాస్తూ...
బాధకి సంతోషపు 
ముసుగు తగిలిస్తూ ..
సాధించిన ప్రతీది 
నాకు స్వంతమే అని భ్రమిస్తూ 
"నా" అని ప్రతి వారిని పిలిచి 
నాలోకం సృష్టించుకున్నా అని 
అల్పసంతోషం అనుభవిస్తూ ..

వంద రూపాయల వెనక 
లక్షరూపాయల కలలు కంటూ ..
రెండడుగులు  వేసి 
విజయాన్ని పొందినట్టు ..
నేనే అనే మాట వెనక 
అందర్నీ నడిపిస్తునట్టు ..
నడుస్తునట్టు ..
కలల పెంకులన్ని 
కనకాభిశేకాలాయినట్టు
కలలో ఆనదం పొంది 
జీవితమే అలా ఉండాలనుకుంటూ .. 

జీవితానికి ఆవల 
జీవం ఉందని 
పుణ్యాల ఖాతా తెరిచి 
మంచికి వెల కడుతూ 
సాటి మనిషిని .. మనిషిలాగే 
చూడక అవసరంగా 
మార్చినట్టు .. 

 నేను సురక్షితమే అని 
నా ఉనికికి ఉచ్చు బిగిస్తూ ..
జ్ఞానం పేరుతో విధ్వంసపు 
చెలిమి చేస్తూ .. 
ఒక్క నిమిషపు వ్యవదిలో 
విస్పోటనం చెందే 
మాటలని తూటాలని ఆయుధాలని 
బాంబుల్ని సృష్టించుకుంటూ ..

శాంతి సహనం .. అర్ధాలు 
పుస్తకాల్లో  వెతుకుతూ ..
ప్రేమ ,న్యాయం .. నాటకాలే 
చేసేస్తూ ..
మంచిని మానవత్వాన్ని 
బంధాల్ని అనుభంధాల్ని 
వస్తు ప్రదర్శన శాలలకి
చిత్రలేఖనాలకి ..కవితలకు
పరిమితం చేస్తూ ... 

మనిషిననే విషయమే 
ఎవరో గుర్తు చేస్తే .. 
ముసుగు తీసే ఇష్టం లేక
నన్ను నేను ఎవర్నో చేసుకునే 
ప్రయత్నంలో ...
 అనుసరనే మార్గం చేసుకొని 
సందిగ్ధతలో కూరుకుపోయి 
చావలేక బ్రతుకుతూ ..
బ్రతుకుతున్న భ్రమలో 
చస్తూ ... లేస్తూ ...  

కోల్పోతున్నా నన్ను నేను 
నేనెవరో తెలుసుకోవడంలో 
జీవించడం మరచిపోతున్నా
అనుక్షణం నటించడంలో ... 

BY-
Mercy Margaret .B
(working as an Asst.professor )
__________________________