Sunday, June 10, 2012


తను ఎగిరిపోయింది ..
జ్ఞాపకంగా తన పంజరాన్ని వదిలి 
తలుపు తీసిన నాకు కృతజ్ఞతగా 
నా చేయి వేలు కొరికి ..

ప్రాణమే అనుకున్నా 
ప్రతి రోజు అలా దాన్ని చూస్తూ ..
కావలసినవన్నీ ఇచ్చా అడక్కుండానే 
అని సంబరపడుతూ ..
బంగారు పంజరం .. 
అందమైన అలంకారం .. 
ఆకలి అనకముందే ఆహరం 
కాని ఏనాడు ఆత్మీయంగా 
నవ్వుతున్నట్టు కనబడలేదే ..?

నాదే ననుకొని రోజు 
గోడు వెల్ల బోసుకున్నా ..
ఎంత ఓపికగా విన్తుందో
అని ప్రేమ పెంచేసుకున్నా 
కాని మౌనంగా రోదిస్తూ 
సహనం ప్రదర్శించింది అనుకోలేదు 

ఒక రాత్రి మూలుగుతూ
రోదిస్తున్న స్వరం వినిపించింది 
గుట్టుగా మనసులో దాచుకున్న
భాదనంత ఏడుపుతో కక్కుతూ 
దాని బాధ ఆ పంజరంతో చెపుతూ ..

తన మనసు నెక్కడో 
వదిలి తను ఇక్కడ వుంటూ ..
తన ప్రేమతో తిరిగిన
ఆకాశ వీధులు   , అడవి మార్గాలు 
ప్రకృతితో స్నేహాన్ని మరువలేక 
నాకోసం ప్రేమ నటిస్తూ ..
అనుక్షణం చస్తున్నట్టు ..
తన దేహమే ఇక్కడ ..తన మనసు 
తన ప్రేమ దగ్గర వదిలి ..
జీవిత నాటకాన్ని కొనసాగిస్తూ 
ముగిస్తున్నట్టు .. 

అది విన్న నా మనసుకు 
కోత తప్పలేదు 
నటించే ప్రేమను నాదాన్ని చేసుకోలేను ..
నా గుండె పంజరమని భావిస్తూ 
జీవచ్చవపు సహగమనం 
సహజీవనం నాకెందుకు ..అని 
తను కోరుకున్న స్వేఛ్చ 
తనకిద్ధామని...నాకేలాగో లేదు 
తన సంతోషమైన తనకు 
తిరిగి ఇస్తానని ... 
నా హృదయ పంజరం తలుపు తీసా ... 


తను ఎగిరిపోయింది ..
జ్ఞాపకంగా తన పంజరాన్ని వదిలి 
తలుపు తీసిన నాకు కృతజ్ఞతగా 
నా చేయి వేలు కొరికి ..