తను ప్రకృతి కాంత ...
వంకరలు తిరిగే తన శిరోజాలు
దాహం తీరని కారు మబ్బులు ..
తన సూటి చూపుల
నొదిలి స్వంతం చేసుకొనే
కనుల కొలనులో కలువల
విప్పారిన సోయగాలు ...
నుదురు పచ్చని పచ్చిక పరిచి
మేఘాలు వర్షిమ్చేందుకు
ఎదురు చూసే తాపసి మైదానం ..
ఆ పెదాలు
చంద్రుని బిగికౌగిట బందించి
చల్లదనాన్ని దొంగాలించే
చుక్కల సాహసం ..
ఆ పుట్టు మచ్చ ..
అందానికి అర్ధం చెప్పి
ఆనందంగా అలా సంతకం చేసిన
ప్రేమ విరామ విరహ చిహ్నం ...
ఇక వర్ణించే సాహసం చేయలేను ..
తనని చూస్తు వుండే సమయాన్ని
వృధా చేయలేను ..
వంకరలు తిరిగే తన శిరోజాలు
దాహం తీరని కారు మబ్బులు ..
తన సూటి చూపుల
నొదిలి స్వంతం చేసుకొనే
కనుల కొలనులో కలువల
విప్పారిన సోయగాలు ...
నుదురు పచ్చని పచ్చిక పరిచి
మేఘాలు వర్షిమ్చేందుకు
ఎదురు చూసే తాపసి మైదానం ..
ఆ పెదాలు
చంద్రుని బిగికౌగిట బందించి
చల్లదనాన్ని దొంగాలించే
చుక్కల సాహసం ..
ఆ పుట్టు మచ్చ ..
అందానికి అర్ధం చెప్పి
ఆనందంగా అలా సంతకం చేసిన
ప్రేమ విరామ విరహ చిహ్నం ...
ఇక వర్ణించే సాహసం చేయలేను ..
తనని చూస్తు వుండే సమయాన్ని
వృధా చేయలేను ..