Thursday, June 14, 2012

ఎవరు వీళ్ళు ?



సమయం రాత్రి ఎనిమిది 
బస్సెక్కి కూర్చున్న .. 
కిక్కిరిసిన జనం 
ఒకరిలా ఒకరు లేరు 
ఒకరి గురించి ఒకరికి తెలియదు 
ఈ సమయంలో ఇంతమంది 
ఏ ఏ పనుల గురించి ఎటెల్లి వస్తున్నారో ..
నాలాగే  అందరూ.....

అలారంతో ఉదయపు పరుగు 
మొదలుపెట్టి 
ఉరుకులు పరుగులతో 
రోజంతా
విసుగుతూ .. నసుగుతూ 
అరుస్తూ ..అల్లరి చేస్తూ  .. 
నవ్వుతూ.. ఏడుస్తూ .. 
పడుతూ లేస్తూ .. 
సాదిస్తూ .. వదిలేస్తూ 
గెలుస్తూ .. ఓడిపోతూ .. 
బ్రతుకుతూ చస్తూ ...
చస్తూ బ్రతుకుతూ ... 
ఎవరెవరో జీవితాన్ని వెదుకుతూ 
ఎందఱో జీవితాన్ని చాలిస్తూ ... 
ఎటు వైపు ఇంతమంది 
ప్రయాణం .. 
ఎటు నుంచి వస్తున్నారు 
ఇంతమంది జనం ..? 

చివరికి అదే స్థలం .. 
ఆరడుగుల లెక్క అందరికి సమం 
ఎటు చూసినా .. 
కుప్పలు పోసిన మాంసపు ముద్దలాగే
కనిపిస్తూ 
ఏ మాంసపు ముద్దకు ఏ ఆట నిర్ణయించాడో
ఆ జగన్నాటక సూత్రధారి 

ఎన్ని పూలు వికసిస్తున్నాయో ఈ క్షణం 
ఎన్ని వాడి రాలి పోతున్నాయో మరు క్షణం 
పూచినంత సేపు పడ్డ ఆనందం 
మరో నిమిషం ఉండదే ?
ఎటు ప్రయాణిస్తున్నారు ... ఇంతమంది 
ఎటు పరుగులు తీస్తున్నారు 
ఈ మాంసపు ముద్దలు .. 

బస్సు దిగుతున్నా  
నా గమ్యం ఇక్కడికేనా  అని ఆలోచిస్తూ 
నా పరుగు కారణం 
తెలుసుకోవాలని .. 
"నేను "ఎవరో తెలుసు కోవాలని 
నన్నే ప్రశ్నించు కుంటూ .. 

♥By- Mercy  (14/6/2012 )♥
__________________________________________