Friday, June 22, 2012

-"నా పెన్సిల్ తెగ షార్ప్ 

ఏది నీ బుగ్గ పట్టు "



-"పో పో నేను నేర్పానుగా నీకు


బడాయి పోకు "


రెండవ తరగతి గది ఇంకా


ఆ పెన్సిల్ గుర్తుల్ని చూపిస్తూ 

...

విరిగిపోయిన పెన్సిల్ ముక్కలని


చేతిలోకి తీస్కుంటూ ...



నేనూ- తనూ


ఆనాటి బుంగమూతి


అలకలకి కన్నీటి పలకరింపులు

చెప్తూ ..


అప్పటి నేస్తాలం


రెండు చేతులను ప్రేమచాలనం చేసుకుంటూ .

రాలిన ఎర్రతురాయి పూలని దోసిళ్ళలో నింపుకొని

అప్పటిలాగే ఒకరిపై ఒకరం విసురుకుంటూ


వర్షంతో సరసాలడి అలిసిన

నేల చెమటసుగంధాన్ని గుండెల్లో నింపుకొని

ఆ జామ బండి కధలు చెప్పుకుంటూ

వేయలేక అడుగులేస్తూ

తన ఒడిలో నుంచి బయటకు

ఒత్తిడితోనే జారిపోతూ



మళ్ళీ అదే మరజీవితం ..

కొనసాగించే నిజ జీవిత నటనకు లోలోనే

సంబాషణల రిహార్సల్ వేసుకుంటూ ...

--{@ ♥ By -Mercy Margaret (22/6/2012 ...2.00 pm ) ♥ @}--

_______________________________________________________