Sunday, June 17, 2012

ఐ లవ్ యు ... నాన్నా..


నాన్నా నువ్వంటే చాలా ఇష్టం ..
ప్రపంచంలో ఉన్న ఎంత తీపి వస్తువైనా
నాకు "నాన్న" పిలుపు తర్వాతే

మొదటి సారి నా నుదుటిపై
నువ్వు పెట్టిన ముద్దు తో ..
నేను నీ స్వాస్థ్యం అయ్యా ..

నా చిట్టి చిట్టి అడుగులు
నీ చేతులపై వేయించి
నడిపిన క్షణాలు అమ్మ చెపితే విని
నీ ప్రేమకు నేను అభిమానినయ్యా ..

నాకు మొదటి అక్షరాలు నేర్పి ..
నాకు జ్ఞానపు దీపం వెలిగించిన
రోజు నా జ్ఞాపకం వస్తే
నీ కోసం ఆజన్మాతం
సేవ చేసిన తీరని ఋణంఅవుతా....

ఈ రోజుటి నేను నిన్నటి
నీ చుపుడువేలే లోకం
అనుకున్న పసిపానవుతా
ఆ చేతి వేళ్ళతో కలిపి నువ్వు
పెట్టిన ప్రేమ ముద్దలతో
కడుపు నిమ్పుకుంటా ..

అక్షర జ్ఞానంతో పాటు
లోక జ్ఞానం నేర్పెప్పుడు
ఇప్పుడు నాకవసరమా అని విసుక్కున్నా
ఈ జనారణ్యంలో ఎలా బ్రతకాల్లో
నేర్పిన నిన్ను మెచ్చుకుంటా ...

నాతో నీ స్నేహం
నా స్నేహితులందరికన్నా
గొప్పది నాన్నా...
ఆ స్నేహమే నాకు
వేరే వాళ్ళతో ఎలా స్నేహం
చేయాలో నేర్పింది అందుకే
నీ మాటలు నేర్చ్సుకునెందుకు
నేను ఎప్పుడు నీ విధ్యర్దినే అవుతా ...

చీకటిని వెలుగులతో నింపమని
నువ్వు చెప్పే మాటలు
నాకు ఎప్పుడు
మార్గదర్శకాలే నాన్న

అన్యాయాన్ని సహించక
అందరికి ప్రేమ పంచి ..
ఆపదల్లో ఉన్నవారి పట్ల జాలి పడి
సహాయం చేసి
కొడుకుగా నీ భాద్యతలు నెరవేర్చి
తండ్రిగా మమ్మల్ని
కడుపులో పెట్టి చూసుకుంటూ
మన ఇంట్లో మహారాజువైన
నువ్వే నా హీరో ...

నాలో నీ పోలికలున్నాయని
వాళ్ళు వీళ్ళు అంటునప్పుడు
ఎంత సంతోషమో
నీ ప్రతిబింబంలా నేనుండాలని కోరిక నాన్నా ..
కాని చిన్న బాధ కొడుకును
కాలేక పోయానని ...
అయినా పర్లేదు కోకుడుకిచ్చే
ఆనందం కన్నా ఎక్కువిస్తా న్న
ప్రమాణం చేయగలను నాన్నా...

ఎప్పుడు .. నువ్వే
నా హీరో నా గురువు ...
దేవుడి తర్వాత నాకు
అంతటి వాడివి కుడా...
నీ ప్రేమకి నేను జీవితాంతం
ఎంతిచ్చినా తక్కువే
కాని మీ అమ్మలా మాత్రం
చూసుకుంటా నాన్నా..
రాయలేక పోతున్న అన్ని
జ్ఞాపకాలను మనసులోనే దాచుకుంటూ ....
ఐ లవ్ యు ... నాన్నా..



( dedicating this to ma beloved dad .. love you dady )
♥ By - Mercy Margaret 17/6/2012 10.30 am )