ఏంటో నేను పిలవకుండానే
కన్నీళ్లు కట్టలు తెంచుకుని
వచ్చేస్తున్నాయి ..
కళ్ళగుండా
నువ్వు రాసిన రాతలు
రహదారులు వేసుకొని
గుండెలోకి చేరి
సున్నితంగా
నా మనసు కప్పుకున్న
పొరను స్పృశించగానే ...
ఎవరు నువ్వు - ఎవరు నేను
ఎక్కడి సంబంధం
రాత పరిచయాలేగా
రాయిపై చెదిరిపోకుండా
రాతలు చెక్కినట్టు
గుండెపై సున్నితంగా
నీ ప్రభావాన్ని
చూపిస్తున్నాయి ..
రాయలేక పోతున్న కలం
ఆలోచనల్లో అక్కడే ఆగిపోయిన
నా హృదయం
ఒక్కసారి నన్ను నీలో చూపిస్తూ
నా మనసుకు ఆలోచనలకు
అయిన అంగవైకల్యాన్ని
ఎత్తి చూపిస్తూ ..
చూడు ..
కారుతున్నకన్నీరు
గర్వపడుతుంది ..
అవి వృధా అవడంలేదని
అభినంధనల సుమాలై
నీ చేతిని ముద్దాడి
నీ పాదాలు తాకాలని ..
ఇదో హృదయమంతా
నీ భావాలు ఆలోచనల తరంగాలే
ఏదో రాయాలని
నీకు సమర్పించాలని కోరిక
కాని ఏంచేయను?
నీ రచనా లోకంలోనే ..
అక్కడే ఆగిపోయి ఇంకా
నీతో అడుగులు వేస్తూ ..
నువ్వు రాసిన ఆ సన్నివేశాలని
నా కళ్ళతో చూస్తూ ..
నన్ను మైమరిచిపోయా
దేవుడు కనిపిస్తే
వరం అడగాలని వుంది
వెనక్కి వెళ్లి నన్ను బాల్యం నుంచే
నీతో పాటు పెరిగే స్నేహితురాలిని
చేయమని ...
(dedicating to the person who made me to write this with his writing what a wonderful part of the novel ... and how great he is really to be .. there will be only few who know how to use the life given by God and I can say he is one of them who gonna be a history maker .. 11/6/2012)