Thursday, June 21, 2012

కన్నీటిపుష్పాల రాయబారం



ఒక్క క్షణం 
దాయకు 
నీ కళ్ళేమో చెపుతున్నాయి 

రెప్పల ఆనకట్టలు దాటి
ప్రవాహమై బయటకొస్తూ
నీ కన్నీటి
బిందువుల్లో నన్నే చూపిస్తూ
ఏవో చెప్పాలనుకుంటున్నాయి

హృదయంతో రహస్యఒప్పందం
చేసుకొని ..
బయటపడకుండా భావాలని ఆపమని
ఎంత లంచం ఇచ్చావ్ ఆ కనురెప్పలకి?

ఎప్పటి వెచ్చని చెమ్మని
ఇంకా గుర్తుంచుకున్నాయేమో అవి
నువ్వు దాయలేని మనసు అద్దాన్ని
నా కనులపై ప్రేమతో ప్రతిబింబిస్తూ ...

పెనవేసుకున్న చూపుల తనువులని
ఇంకా గుర్తుంచుకున్నాయేమో అవి

మనసు పంపే రాయబారం
ఆ కన్నీటిపుష్పాలై ...
హృదయంతో విభేదిస్తూ
నాపైవున్న ప్రేమని దాచుకొని
నువ్వు లోలోపల
హృదయపు గొంతునులిమితే చూడలేక చూస్తూ

ఈ ఒక్క క్షణం ఆపకు
వినకుండా ఆ వియోగ గీతాన్ని
నీ హృదయపు గొంతును కోయకు ..




--{@ ♥ BY- Mercy (21/6/2012 8.00pm ) ♥@}--
__________________________