తను ఎప్పుడూ నా రెప్పలపైనే
కరుగుతూ కళ్ళలోకి
కలలుగా ఒంపుతూ
వచ్చేపోయే కలలలో తన కొరత ఇంకా
ఉండదని హామీ ఇస్తూ
వెచ్చని చీరకట్టి
స్వచ్చమైన మల్లెలు పెట్టి
నవ్వుల పట్టీలు కట్టి
మోహపు కాటుక పెట్టి
నేనున్నా అంటూ సవ్వడిచేసే
గాజులు తొడిగి
ప్రేమ అక్షయ పాత్రని నడుమున పెట్టుకొని
కళ్ళకి తాళాలేసే తన పదిలమైన
ముద్దును చెక్కుడు బిళ్ళగా
గుండె శబ్దాన్ని రాసిచ్చా
రాత్రంతా తన సొత్తుగా
ఇక ఆలస్యం ఎందుకని గోల చేస్తున్న కళ్ళు
అమృతాన్ని సేవించాలని ఎదురు చూస్తూ
పిలుస్తున్నాయి గోముగా
--{@ BY- Mercy Margaret (26/6/2012...10.30pm ) @}--
కరుగుతూ కళ్ళలోకి
కలలుగా ఒంపుతూ
వచ్చేపోయే కలలలో తన కొరత ఇంకా
ఉండదని హామీ ఇస్తూ
వెచ్చని చీరకట్టి
స్వచ్చమైన మల్లెలు పెట్టి
నవ్వుల పట్టీలు కట్టి
మోహపు కాటుక పెట్టి
నేనున్నా అంటూ సవ్వడిచేసే
గాజులు తొడిగి
ప్రేమ అక్షయ పాత్రని నడుమున పెట్టుకొని
కళ్ళకి తాళాలేసే తన పదిలమైన
ముద్దును చెక్కుడు బిళ్ళగా
గుండె శబ్దాన్ని రాసిచ్చా
రాత్రంతా తన సొత్తుగా
ఇక ఆలస్యం ఎందుకని గోల చేస్తున్న కళ్ళు
అమృతాన్ని సేవించాలని ఎదురు చూస్తూ
పిలుస్తున్నాయి గోముగా
--{@ BY- Mercy Margaret (26/6/2012...10.30pm ) @}--