Tuesday, June 5, 2012

సిరి సిరి మువ్వలు (ఫెంటోస్)



చుక్కల్ని కోద్దాం వస్తావా..?
నా ప్రేమకి వాడిపోని పూలు కావాలట ..!!


నవ్వడం నేర్పే మాస్టారు -
కావాలి .. నా కన్నీలకు ..!!

తన నిచ్వాస సెగతగిలి 
కర్పూరంలా కరిగిపోతున్న మనసు ..!!

ఆ నుదుటిపై అడుగేసి 
సాహసం చేశా .. సింధూరంలా మారి బందీనయ్యా ...!!

నా పెదాలపై వాలిన
 రంగుల సీతాకోక చిలుక ... నీ జ్ఞాపకం .!!

ఆ సొట్ట బుగ్గల్లో ..
సిగ్గుపూ మొగ్గలా నేను .. !!

ఆకాశంలో నీ ప్రేమ చల్లా ..
నక్షత్రాలై నన్ను చుట్టుకున్నాయి ..

పిచికారి చేసి వెళ్ళు .
జ్ఞాపకాలపై నీ ప్రేమ కౌగిలి జల్లు !!

నాతో ఉన్నావన్నఅబద్ధమే హాయిగుంది ..
నిజంగా నువ్వులేని శూన్యం కన్నా ...!!

వెలుగై వస్తావా చెప్పు .
చీకటి కౌగిలి వదిలేస్తా ..!!.

తేలికైపోదా హృదయం ...

నీ మాటల మధువు తాగి ...!!

నన్ను హత్తుకోవా .. ??
నా ఒంటరితనం నీదయ్యేలా ...!!

ఎంతో చెప్పాలని ఉదయిస్తా .. 
నీ రాక కోసం ఎదురు చూస్తూ అస్తమిస్తా ...!!


నీ గుండె లోతెంతని
కళ్ళను - ప్రశ్నిస్తే ... కన్నీళ్లనడిగి తెలుసుకోమంది ...!!

ఈ రోజు నవ్వు చెల్లించలేదు .. 
అందుకే నా శ్వాస జప్తు చేసుకున్న ప్రేమ ...!!

నీ పేరు వినగానే ... 
నవ్వు వెనక పెదాల ఆలింగనం చూడు .. .!!

జ్ఞాపకాన్ని ఇప్పుడే కోసి .. 
అనుభవాల సిగలో అలంకరించా ..!!

సముద్రపు హృదయం పరుగు .. 
తీరాన్ని హత్హుకునే వరకు ...!!

గుండె నిండా నమ్మకం  నింపింది 
అమ్మ .. ఈ ఉద్యోగం వస్తే చీర తీసుకెల్తా ....!!

జారవిడిచిన పట్టుదల .. 
సోమరితనానికి దొరికిందట లాక్కోపో ..!!

గెలుపు జోళ్ళు .. 
ఎక్కడ పడితే అక్కడ అమ్మరు...!!

కలం చచ్చిపోయింది .. 
సిరా అంతా నీకోసం ఒలికించి ...!!

త్రవ్వుతున్నా నా కోసం .... 
చీకటి దారుల్ని వెలుగు జాడల్ని ...!!

గాయం గానమాలపిస్తే... 
నువ్వే ఆ పాటకి పల్లవి,నేను చరణం ...!!

నీదైన ఏదో జ్ఞాపకం ...
నిశబ్దాన్ని చీల్చి నన్ను హత్తుకుంది ..!!

ఎండతో ఎవరు రమ్మన్నారు ..
వానా ?? హత్తుకోలేదని ఎవరేడ్వమన్నారు .....

తన అసంతృప్తి అసహనం .. 
నా గుండెని మంట పెట్టే నిప్పు కణం ..

పగిలిన కుండ పూలతొట్టి
ఇప్పుడు .. ఆలోచన దారుల్లో జ్ఞానం వెదుకు ...


జ్ఞాపకాల దుస్తులు ..
వయసుతో పాటు పెరుగుతూ ..

మధుర జ్ఞాపకాల కోక 
చుట్టి నీ గుండెపై వాలా సీతాకోకచిలకై ..