Tuesday, June 19, 2012

చిట్టి పొట్టి జ్ఞాపకం

చిట్టి పొట్టి జ్ఞాపకం 
________________

తమ్ముడు నీకోక పేజి నాకొక పేజి .. 

పద పడవలు చేసి ఆడుకుందాం 

నేను చేసిస్తాను నువ్వు ఉండు .. 


చిమ్పెస్తున్నావ్ కదా 

ఇదో ఇటు వైపు నాది వేస్తాను ..

అటువైపు నీది సరేనా ఎవరది మున్దేల్తుందో చూద్దాం

నీది ముందేల్తే నీకు నా చోకోలేట్ ఇస్తా ..

మరి నాది ముందెల్తే నీ చోకోలేట్ ఇవ్వాలి సరేనా

అయ్యో నీ పడవ బోల్తాపడి కొట్టుకు పోతుందే ..

ఏడవకు అమ్మ వింటే నన్ను కొడ్తుంది రా ..

పట్టు ఈ చోకోలేట్ కుడా నువ్వే తీస్కో ...

అమ్మ పిలుస్తుంది పరుగెట్టు పదా .

దొరికమంటే ఇద్దరికీ దెబ్బలే ..

హే వానా ఇక్కడే వుండు మళ్ళీ వస్తాం.. పోవద్దు

లేదంటే అమ్మకి కనిపించవో

నిన్ను చెవి మేలేస్తుంది ...


!♥♥ By- MERCY .. ఇలా ఆడుకున్న నా బాల్యం మళ్ళీ వస్తే బాగుండు .. అప్పటి ఆ ప్రేమాప్యాయతలు 

తిరిగొస్తే బాగుండు ...18/6/2012 ♥ ♥)

__________________________________________________