ఆకు పరదా వెనక దాక్కుని
దొంగ పిల్ల
ఎలా చూస్తుందో చూడు
నా పలకరింపుల తొలి చినుకు తనని తడమగానే
తన వైపే
చూస్తున్నాన్నా అని
తొంగి తొంగి చూస్తూ
అప్పుడప్పుడే నేర్చుకున్న
సిగ్గునంతా ఒలకబోస్తూ
ఓర చూపులతో
మనసు ఉక్కపోతను
చల్లార్చే మంత్రం ఏదో ఇప్పుడిప్పుడే
నేర్చి నా మీద ప్రయోగిస్తూ
తొందరపెడుతూ గుండెని
మైళ్ళు పరుగెత్తిస్తూ
విచ్చుకున్న నుంచి దాచి
పరువాల సిగ్గు
తొలకరిన నన్ను కలిసే
వేళ కోసం ఎదురుచూస్తూ
గాలితో తను పంపిన మూగ మనసు ముచ్చట్లు
నన్ను చేరాయా లేదాని వాకబు చేస్తూ
ఎంత నేర్చిందో చూడు
నా మరదలు పువ్వు ..
కురిసేవరకు నాతో చిలిపి గొడవ
పడుతూ ...
పిలిచి పిలిచి ఇప్పుడేమో దొంగాటలడుతూ...
-దొంగ పిల్ల...!!
♥--{@ BY -Mercy Margaret (26/6/2012...3.55am) @}--♥
దొంగ పిల్ల
ఎలా చూస్తుందో చూడు
నా పలకరింపుల తొలి చినుకు తనని తడమగానే
తన వైపే
చూస్తున్నాన్నా అని
తొంగి తొంగి చూస్తూ
అప్పుడప్పుడే నేర్చుకున్న
సిగ్గునంతా ఒలకబోస్తూ
ఓర చూపులతో
మనసు ఉక్కపోతను
చల్లార్చే మంత్రం ఏదో ఇప్పుడిప్పుడే
నేర్చి నా మీద ప్రయోగిస్తూ
తొందరపెడుతూ గుండెని
మైళ్ళు పరుగెత్తిస్తూ
విచ్చుకున్న నుంచి దాచి
పరువాల సిగ్గు
తొలకరిన నన్ను కలిసే
వేళ కోసం ఎదురుచూస్తూ
గాలితో తను పంపిన మూగ మనసు ముచ్చట్లు
నన్ను చేరాయా లేదాని వాకబు చేస్తూ
ఎంత నేర్చిందో చూడు
నా మరదలు పువ్వు ..
కురిసేవరకు నాతో చిలిపి గొడవ
పడుతూ ...
పిలిచి పిలిచి ఇప్పుడేమో దొంగాటలడుతూ...
-దొంగ పిల్ల...!!
♥--{@ BY -Mercy Margaret (26/6/2012...3.55am) @}--♥