Friday, June 29, 2012

ఏం చేసావో

కన్నీటి చిక్కదనంతో 
కలల పొంగులను 
కంటి తీరాలకు తెస్తూ ..

పెనవేసుకున్న చూపుల 
భావాలని ఆపమని 
రెప్పలతో ఒప్పందం..
చేసుకుంటూ 

వర్షంతో సరసాలటలో
అలిసిన నేల
చెమటసుగంధం గుండెలో .
దాచుకుంటూ

మేఘాలన్నీ కుప్పనూర్చి ...
నీ నిట్టుర్పుల సెగ దాడి నేదుర్కోడానికి
ప్రయత్నం చేస్తూ

నీ ఊహలు అమృతమని
అతిగా సేవించా ..

ఏం చేసావో .. నీ మత్తులో కూరుకుపోతున్నా
ఇక చావో రేవో

♥--{@ BY- Mercy Margaret (23/6/2012) @}-- ♥