Saturday, June 16, 2012

నా మూర్ఖత్వం




నా మీద నాకే అసహ్యం 
నా మూర్కత్వం నా ముందు 
నిలుచున్నప్పుడు 
నాకు నేనే అందవిహీనంగా 
కనిపిస్తున్న నిజం 
నన్ను నేనే అసహ్యంగా 
చూడలేక చూసుకుంటునప్పుడు...

ఎదుట నిజమే ఉన్నా 
ఒప్పుకోలేక నసుగుతున్నప్పుడు 
కంటి ముందు వెలుగును 
చీకటితో పోలుస్తూ 
కారణాల్ని లెక్కిస్తునప్పుడు ...

స్వేఛ్చ పుష్కలంగా బహూకరించినా
బానిసత్వంలోనే ఉండడానికి 
ఇష్టం చూపిస్తూనప్పుడు 
ప్రేమ కౌగలించుకుని నేనున్నా అన్నప్పుడు 
అనుమానంతో దానిని 
దూరం చేసుకున్నప్పుడు ...

అక్షరాల వెలుగుల్లో నన్ను నేను 
చూసుకుంటూ .. లేని జ్ఞానం 
ఆర్జించే   క్రమంలో  అన్నీ తెలుసనుకొని 
డాంబికం ప్రదర్శించినప్పుడు ...

వికసించిన పువ్వు నవ్వు కన్నా 
ముళ్ళ కఠినత్వాన్ని చూస్తున్నప్పుడు 
ఒక్క అడుగు ముందుకు వేయకుండా 
గమ్యాన్ని నిందిస్తున్నప్పుడు 
సుఖాలన్నీ అనుభవిస్తూ తృప్తి చెందక
భాదల లోగిలి ముందు నిల్చొని 
లేవలేనన్నట్టు ...

ఎంత బద్ధకం నాకు 
నాలో నేను తొంగి చూడకుండా 
నేనే అంతా అయినట్టు భ్రమిస్తూ 
ఓటమిని ఒప్పుకోలేక గెలుపుకు 
తలుపులు మూస్తూ ... 
మిగిలి పోతున్నా ఒంటరిగా 
ఎవరికీ నేను పట్టనట్టు ... 

అందుకే ...
నా మీద నాకే అసహ్యం 
నా మూర్ఖత్వం  నా ముందు 
నిలుచున్నప్పుడు 
నాకు నేనే అందవిహీనంగా 
కనిపిస్తున్న నిజం 
నన్ను నేనే అసహ్యంగా 
చూడలేక చూసుకుంటునప్పుడు,,,!!

♥ BY- Mercy (15/6/2012 ) 11.26 pm ♥