పొగలు పోగలుగా నీపేరు
నా పెదాల వనాలను పలకరిస్తుంది
వింటున్నావా ?
* * * * *
జీవితపు మలుపు చివర నీ పేరే
నాకు మజిలీ అయి కనిపిస్తుంది
* * * * *
ఉదయం పొగ మంచులోంచి ఒక కిరణం
నీ పేరేనా ?
నా కళ్ళను పొడుస్తూ నిన్ను వెతికేలా
నా మెలుకువవుతుంది
నువ్వే నా ఆలోచన ఊటవా ?
* * * * *
నా గాయానికీ నువ్వు బాగానే పరిచయం
నువ్వు కనబడగానే స్రవిస్తున్న రక్తంతో
నీ పేరును కలవరిస్తుంది
ఔషదమనా ?? లేక ఆరొపిస్తూనా ??
* * * * * *
నా గమ్యం నువ్వేనా ?
(16/11/20)