నా ఒంటరితనపు అద్దంలో
నీ ముఖం ప్రత్యక్షమవుతూ
ఒంటరితనమంటే నువ్వు
అంటూ
క్రొత్త నిర్వచనం ఏదో నేర్పుతుంది
నన్ను నేను సరి చేసుకుంటూ
నాలో నేను తొంగిచూసుకుంటానా ...!?
నువ్వు
ఒక నవ్వు ఎర వేసి
నన్ను అక్కడే చిక్కుకునేలా చేసేప్పుడు
నీ ముఖంలోని ఆనందం
నా కళ్లని నీ ప్రేమతో నింపి,
కనురెప్పలకిందే సాక్షమై కూర్చుని
భయపెట్టే మలినాన్ని
కడిగేస్తుంది
ఇక నేను
ఆలోచనల్లో దారి తప్పిన ప్రతిసారి
చెవులగుండా నీ ప్రభుత్వాన్ని పంపి
నన్ను నీ అజమాయిషి కిందకి తెచ్చుకుంటావ్
అప్పుడు నీ ఆజ్ఞలు నాకు కరదీపికలవుతాయి
ఇదిగో ఇలాగే
నా చేతి గీతల్లో
నీవై నిండిన
నా భవిష్యత్ రాతల్లా
నా పెదాల ఉద్యానవనం ఆస్వాదించే
నవ్వుల పొగమంచులా
(17/112012)