Friday, November 2, 2012

నాది స్వార్ధమేనా



ఎప్పటినుంచో వెంటతీసుకెళ్లాలనీ
నాతో ఉంచేసుకోవాలని
చిన్నతనం నుంచే తనంటే ప్రేమ మరీ
కానీ .. తనకి నాతో
రావడం .....????

అందుకే కబుర్లన్ని చెపుతున్నా
ఎమన్నా అంటేప్రేమలో పక్షపాతం ఉందనిఅదో ఆ పత్తి రైతు పిలుస్తున్నాడంటూ


-"ప్రేమిస్తున్నా
నీరాకకై ఎదురుచూస్తున్నానంటూ"..
ఎన్ని అక్షరాల పూలు కలిపి
భావాల దారంతో
కవితల మాలల్లి
బహూకరించే ప్రయత్నం చేస్తున్నానో
అయినా రాదే!?

నీలాంటి ప్రేమికులు నాకెక్కువే
వారి ప్రేమ ఘాడతని తూకమేసినా
ప్రశ్నల త్రాసు త్రాళ్లు
తెగిపోయెలా ఉన్నాయి
ఏం చేయను ??
అని సమాధానం ఇస్తుంది

నువ్వూ నిందించు పర్లేదు

-" ఏంచేయను మరి
నోటిని పలకరింఛే ఆ అయిదు వేళ్లంటే
నాకిష్టం
భూమిని తల్లినిగా భావించి ఆకలి కడుపులకై
ఆలోచించే ఆ గుండెలు నాకిష్టం
ప్రకృతికి హాని చేయకుండా పచ్చదనం ఇష్టపడే
పసితనపు హృదయాలిష్టం
సర్వజనుల క్షేమం కోరి నన్ను ప్రేమగా
పిలిచే వారి స్వరాలిష్టం  "..
ఎలా రాను అంటూ ??

గబ గబా
కురవడానికి  నన్నిలాగే వదిలి 
బయలుదేరింది
వర్షం