ఉదయం
మరో ఖాళీ పెట్టెతో వచ్చింది
మొదలు పెట్టు
ఏమేమి ఆ పెట్టెలో
నీకోసం ఎన్నుకొని నింపుకోబోతున్నావో
జీవితానికి నువ్వేమి ఇవ్వబోతున్నావో
జీవితం నుంచి ఏమి ఆశిస్తున్నావో
జీవించబోతున్నావో
జీవితాన్ని ఈడ్చుకుపోతున్నావో
జీవితపు దారిలో దొరికే ప్రతిదాన్ని
ఎలా ఎన్నుకోబోతున్నావో ..!!?
( 30/11/202)