Friday, November 30, 2012

ఏం చేయను ?



నా నిదురెత్తుకెళ్ళి నీ కలలిచ్చి పోతావ్ 
ఏం చేయను ? 
నీ ఆలోచనల్లో జోగుతూ నేనుంటా 
ఎత్తుకెళ్ళిన నిద్రను అనుభవిస్తూ నువ్వు ..
నన్ను 
ఏదో ఒకటి మాట్లాడమంటూ నా కనురెప్పలకి 
కవితలు చదవడం నేర్పిస్తావ్ 


కవితంటే ఏంటో ఇంతవరకు నాకు తెలియనే తెలియదు 

నీతో మాట్లాడాల్సినవన్ని వరుసగా రాస్తానా ..!?
ఆ పిచ్చి రాతలే నాకు నిద్రకు బదులుగా దొరికిన 
ప్రత్యామన్యాయాలు 

అప్పుడనిపిస్తుంది . . . .

సరిగ్గా ఇలాగే నిదురోతున్న నీ కళ్ళవైపు చూస్తూ 
శ్వాస పలకరింపుల మధ్య 
భావాలను వెతుక్కుంటూ జోల పాట నొసటిపై నొక్కుతుంటే 
అదే నాకు కవితేమోనని 
నీ నవ్వునంతా గంధంలా నా ఒంటికి రాసుకోవడమే కవితేమోనని 

ఇంకా అర్ధాన్ని వెతుకుతూ 
నీ నిదుర తెర ఈవల నిలబడి నీ మెలకువకై 
మంచులో తడుస్తూ నిల్చున్నా 
ఒక సారి ఉదయమే నన్ను చూడు ఘనీభావింఛి పోయిన వేళ 
నాకోసం వస్తావు కదూ 




 (18/11/2012 )