Friday, November 30, 2012

ఆత్రుత

అక్కడ

ఓ మూలాన కూర్చున్న ఆలోచన 
కలంలో అక్షరాలని ఒద్దికగా నింపుతుంది 

ఆ కాగితం 
తనపై పరుచుకోబోయే భావాలకై ముస్తాబవుతూ 
రెప రెపల రాగం ఆలపిస్తుంది 



పుస్తకం లోని నెమలీక మెల్లిగా నవ్వుతూ 

కాగితంతో సరాగాలాలపిస్తుంటే 


సన్నగా నవ్వుతూ ఆలోచన 
చేతి వేళ్ళకు అంటుకున్న అక్షరాలను తుడుచుకుంటూ 
జిడ్డుగా ఆ వేళ్ళకు అంటుకున్న వాటిని 
పరీక్షగా చూస్తుంది 

అవి 
నీపేరు లోని అక్షరాలే 
చేతి వేళ్ళకు అంటుకొని అలా వేలాడుతూ 
మరో మధుర కావ్యం నీకై బహూకరించేందుకు 
వేళ్ళతో సరసాలడుతున్నాయి ..





(18/11/2012)