ఈ సాయంకాలానా
వెలిగించిన దీపాలను వదిలి
నీ మాటల గాలి నన్ను తాకిందని
వెతుకుతూ ఇలా
బయల్దేరివచ్చాను
కనిపించిన వెలుగుదారుల్లో
ప్రతి పువ్వుకూ
ఒక ఉత్తరం రాస్తూ
ప్రతి దానిపై నీ పేరట నా చిరునామా
రాసి వదిలి వచ్చాను
నా ఒంటికంటుకున్న
పరిమళం
ఎక్కడో నీవు వెదజల్లుతూ వెళ్లిన ప్రేమదేనని
నా ఒంటరితనాన్ని
వెలిగించిన దీపాలకే
వదిలి వచ్చాను
ఇప్పుడైనా నా ముందుకు వస్తావా
ఇంకా బాటసారిగా మిగిలిపోలేను
మన రాక కోసం ఎదురుచూస్తున్న దీపాలకు
ఇంకా నిరీక్షణ నూనెను పోస్తూ
ఆవిరవలేను
-------by Mercy Margaret (5/11/ 2012)---------------