Friday, November 30, 2012

ఏకాంతపు దారి




అడుగుకు అడుగుకు మధ్య
గతమై మిగులుతూ ,
మరో అడుగుతో జోడించుకుంటూ
నీవు లేని క్షణాలు మిగిలిపోని
ఏకాంతపు దారిలా .. 



(12/11/2012)



కంటి నిండా నింపుకున్నా
ఆకాశాన్ని ..
అప్పుడు నేను
ఒంటరి
ఇప్పుడు నువ్వొచ్చావ్
ఆకాశం
కరిగిపోతూ కారుతుంది
నీలి రంగై
సిరాగా మారి రాస్తుంది
నా దారి పొడుగునా ..
నీ పేరు నా తోడై


 1/12/2012



ప్రస్తుతానికి నీ తోడుని
కలిసి నడవనీ నీతో కడదాకా
అడుగుల కింద పరుచుకున్న

l ఆక్రమణ ll by Mercy Margaret