Friday, November 9, 2012

ఒక పరిచయం ముగుస్తూనే


ఒక పరిచయం ముగుస్తూనే
రెండు
అపరిచిత ఆకులను కుడుతూ
పూచిన పువ్వు రాలిపోతూ
సంభందపు సుగంధాన్ని
గుర్తుగా మిగిల్చి పోతుంది



ఒక పరిచయం ముగుస్తూనే

పగలు నుండి రాత్రిని
వేరు చేసె కవ్వమేదో
మనసుని చిలికి 
జ్ఞాపకాల వెన్నని చేతిలో 
చంద్రుని ముద్దగా ఇచ్చి  పోతుంది



ఒక పరిచయం ముగుస్తూనే 

తలుపులను మూసినా 
ఖాలీ  సందులనుంచి ప్రయానిస్తూ 
ఒక రాగం మూసిన చెవుల గోడలను కూల్చుతూ 
అందమైన అందమైన ఉద్యానవనాలను 
చెవులకు వేలాడదీస్తుంది 



ఒక పరిచయం ముగింపు ..




ముగింపు కాదది 

మరో జన్మ కోసం 
అడుగులు వేస్తున్న ఆత్మ తపస్సు 
మూసుకు పోయిన కళ్ళ వెనక కధలు రచిస్తూ 
గాలితో జతకట్టి 
హృదయాన్ని స్పృశిస్తుంది