ll విజ్ఞప్తి ll
-------
ఆ అద్దాల వెనక నుండి
బయటకొచ్చి చూడనీ
ఒకటే రంగుతో ఎంత కాలం
లోకం ఇదే అని చూపిస్తావ్ ??
అబద్దాన్ని నిజాన్ని ఒకేలా
ఎంత కాలం చూడమంటావ్ ??
ఈ కళ్ళను కూడా జీవించనీ ..
-----( 29/11/2012)-----
ll కొన్ని క్షణాలు ll
--------------
కొన్ని క్షణాలను
నీ జ్ఞాపకాలలో కాల్చా
గాలిలో పొగలుగా కలిసి
కళ్లలో దూరి
కంటి పొరలలో దాచుకున్న
నీవైన కొన్ని చిత్రాలను తడిమి
కన్నీళ్లై
ముత్యాలు రాలుతున్నాయి
ఇవిగో నీ దొసిలి పట్టు
--- (28/11/2012)--
ll ఈ ఆలాపన ll
-----------------
రాయి పాడుతుంధని ఆశ్చర్యమా !
ఏమి చేయను మరి ?
ఒంటరి తనపు ఉలిపై
జ్ఞాపకాల దెబ్బలు వేస్తుంటే
గుండె శిల్పంగా మారుతూ చేస్తున్న రోదనే
ఇధి ..
---- (28/11/2011)---