Saturday, January 5, 2013

రసాయన చర్య




పడిలేచిన ప్రతి సారి 

ఎవ్వరు చూడలేదని 

సర్దుకుని లేచే పసివాళ్ళమే మనం 


అప్పుడప్పుడు 

కడుపు నిండుగా ఉన్నా

మనసు నిండుగా లేని పరిస్థితులు


అటు ఇటుగా తొనుకుతున్న ఆలోచనలు

సగం ఖాళీ అయి ఊపుతున్న మెదడును

కొద్ది సేపైనా స్థిమితంగ ఉంచడానికి


అవసరమైనంత మేర 

మెదడును మనసును నిండుగానింపే

ఎదో రసాయన చర్య ఎప్పుడు జరగాల్సిందే

జీవిత ప్రయోగశాలఎప్పుడు 

ఎదో ఒక కొత్త సృష్టిని చేయాల్సిందే

పసి పాప దగ్గర నుంచి 

పండు ముసలి వరకు 

లోలోకి ప్రవహించి కొన్ని సార్లుసేద తీరాల్సిందే