కిటికీలోంచి బయటికి చూస్తున్న నాకు ప్రశాంతంగా యోగ ముద్రలో ఉన్నట్టు కనిపిస్తుంది ఆ చెట్టు .
ఆ కిటికీ రెక్కలోంచి వెలుగు కొన్ని ఆకులపై పడుతుంటే , ఈ సమయంలో
ఇంకేం పనిలేదా అని కోపంగా , కనుబోమ్మల్లు చిట్లిస్తూ చూస్తున్నట్టుగుందీ.
చెట్లకు కూడా జ్ఞానం కావాలని వాటికి స్కూల్లుంటే ??
ఆ కిటికీ రెక్కలోంచి వెలుగు కొన్ని ఆకులపై పడుతుంటే , ఈ సమయంలో
ఇంకేం పనిలేదా అని కోపంగా , కనుబోమ్మల్లు చిట్లిస్తూ చూస్తున్నట్టుగుందీ.
చలి ఏదో నేర్పుతానని కనుపాపపై నుంచి నిదురపొరను తీసి ,వణుకుతున్న దేహంతో సంగీతంలో ఇదో కొత్త ఆలాపన అంటూ చెవులలో గుస గుస లాడుతుంటే
ఆ చెట్టు వైపుకు నా చూపును తీసుకేలుతుంటే ఏవో ఆలోచనలు ....
ఆ చెట్టు వైపుకు నా చూపును తీసుకేలుతుంటే ఏవో ఆలోచనలు ....
చెట్లు కూడా మనలాగే నడవగలిగితే ఎలా ఉండేది ?
వాటికి కూడా మాట్లాడ్డం వచ్చి ఉంటె ఈ సమయంలో ఏ కబుర్లు చెప్పేవి ?
సంగీతానికి ఏ నృత్యం చేసేవి ?
సంగీతానికి ఏ నృత్యం చేసేవి ?
ఉదయాన్నే పక్షులతో పాటు ఏ పాటతో మనల్ని నిద్రలేపేవి ? రాతిరి ఏ పాటతో నిదురబుచ్చేవి ?
సాదు జంతువులను పెంచుకున్నట్టు వీటిని పెంచుకుంటే ? మన లాగే పుట్టి పెరిగి మనలాంటి ఉనికే కలిగి ఉండి మనతో పాటే
సాదు జంతువులను పెంచుకున్నట్టు వీటిని పెంచుకుంటే ? మన లాగే పుట్టి పెరిగి మనలాంటి ఉనికే కలిగి ఉండి మనతో పాటే
చనిపోయేలా ఉండి ఉంటే ..?
పసి పాపలాంటి చెట్టు , మాటలు నేరుస్తున్న చెట్టు , వివాహనికోచ్సిన చెట్ట్టు ... అంటూ అవి మనలాగే జీవిత దశలు కలిగి ఉంటే ..??
పసి పాపలాంటి చెట్టు , మాటలు నేరుస్తున్న చెట్టు , వివాహనికోచ్సిన చెట్ట్టు ... అంటూ అవి మనలాగే జీవిత దశలు కలిగి ఉంటే ..??
చెట్లకు కూడా జ్ఞానం కావాలని వాటికి స్కూల్లుంటే ??
మనిషి బాధలన్ని విని , పంచుకుని , తిరిగి సమాధానం ఇవ్వగలిగెట్టు ఉంటే ?? మనిషికో చెట్టు నేస్తం ఉండేది కదూ ..!!
by Mercy Margaret (12 -12- 2012)