ఈ భూమిపైన
అసమానమైన ,అద్వితీయమైన , అనుపమానమైన ,
అపూర్వమైన అద్భుతానికి పేరైన ఏకైక వ్యక్తివి
" నువ్వు "
నీకు నకిలీగా , నీకు మారుగా, నీ నమూనాలో ఎవ్వరూ లేరు
ప్రపంచం సృష్టింపబడినది మొదలు నీలా ఎవ్వరూ లేరు
ఎవ్వరూ ఉండబోరు
నీలాంటి వ్యక్తిత్వంతో ,నీకొచ్చిన అవకాశాలు నీలాంటి ఆలోచనలు , నీకొచ్చిన బాధలు సంతోషం
అవకాశాల సమన్వయాలు ,ఎవ్వరికీ లేవు రావు
నీ తల వెంట్రుకలు , వాటి పెరుగుదల చేతి వేళ్ళ గుర్తులు ఈ ప్రపంచంలో నీకు తప్ప ఇంకెవరికి లేవు
నువ్వు నువ్వే
అందరిలోకి వేరుగా
నువ్వు లేకపోతే సృష్టి నిర్మాణపు ప్రక్రియలో నీ స్థానం ఖాళీగా ఉండేది.
నువ్వే లేక పోతే సృష్టిలో ఒక గొప్ప లోటు మిగిలుండేది .
నీలా ఎవరూ ఆలోచించరు ,
నీలో పూసే భావాల పుష్పాలే సృష్టిలో ప్రత్యేకం .
భాదల్లో ఉన్నవారికి నువ్విచ్చే హత్తుకోలు అధ్బుతమైన ప్రత్యెక సంతకం
నీలా పూయించగలరా చిరునవ్వులేవరైనా ?,
ఎదుటివారిని అర్ధం చేసుకుని వారితో నీలా మనలేరు .
నవ్వించనూ లేరు
దిగులు దిగుడు బావి నుండి నుండి బయటికి లాగలేరు .
నీలా ఉదయాలను పరిమళింప చేయలేరు .
నీకు తెలుసా నువ్వు ఏకైక అపురూపమైన వ్యక్తివి .
ఆనందించు , సంతోషించు
నీ ఆనందాన్నిజీవితపు ఖజానాలో దాచిపెట్టుకో .
"నువ్వు "
ప్రవహించు అందరిలోకి ఒక విభిన్న వ్యక్తిగా ,
నీ స్నేహితుల్లోకి ,సమాజంలోని ప్రతి ఒక్కరి హృదయాలలోకి,
నువ్వే బహుమతిగా , నువ్వే చిరునవ్వుగా , సృష్టికే నువ్వొక కానుకగా.