Saturday, January 5, 2013

జ్ఞాపకంగా మిగలబోయే సంవత్సరమా

జీవితపు తలుపు తెరుచుకుని 

మరో సారి చదవాల్సిన ఉత్తరాలను 

మూట కట్టి పెట్టుకుని అటక మీద వేసుకోబోయే 


రోజు 

ఈ సంవత్సరానికి

చివరి రోజు

ఎన్నో

కలలు ఆశలు

బంధాలు అనుబంధాలు

ప్రేమలు ఆప్యాయతలు

నిరుత్సాహాలు నిట్టూర్పులు

విజయాలు ,అపజయాలు

ఈసడింపులు ,ఆత్మీయతలు

అన్నీ
నింపి

జ్ఞాపకాలుగా మిగల బోయే గంటలు

ఉదయమే కను రెప్పలు

కొన్ని బరువైన నిట్టూర్పులు వేడి వేడి స్మృతులు

కళ్ళకి తగిలించి

జీవితానికి ఇంకో సంవత్సరం మెయిలు రాయోచ్చిందని

గుర్తు చేసిన రోజు

అమూల్యమైన ఫలాలను కొన్ని

ఈ సంవత్సరపు కాయలుగా తెంచి దాచుకున్నా

రాబోయే సంవత్సరానికి

నా దారిలోని

ఎత్తు పల్లాలను మట్టం చేసుకుంటూ

నా సమయాన్ని చదును చేసుకుంటూ ..
(31/12/2012)